
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని టీం చెప్తోంది. వచ్చేనెల 12న మూవీ విడుదల కానుంది. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే కొత్త సినిమా షూటింగ్ ని మహేష్ బాబు మొదలు పెట్టేందుకు అవకాశం ఐతే ఉంది. కానీ మహేష్ బాబు ఈ సినిమాని మరో మూడు నెలలు వాయిదా వేసినట్లు టాక్.
‘సర్కారు వారి పాట’ విడుదలైన వెంటనే మహేష్ బాబు వెకేషన్ కి వెళ్తారు. జూన్ లో తిరిగి హైదరాబాద్ వస్తారు. ఒక నెల గ్యాప్ తర్వాత షూటింగ్ కి సిద్ధమవుతారు. అంటే మహేష్ బాబు – త్రివిక్రమ్ కొత్త మూవీ షూటింగ్ జులైలో మొదలు కానుంది.
పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆమెని కూడా జులై నుంచి డేట్స్ అడిగినట్లు సమాచారం.
రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలైనా, ఏడు నెలల్లో దాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో సినిమాని విడుదల చేస్తారు. ఇక రాజమౌళి, మహేష్ బాబు మూవీ కూడా వచ్చే ఏడాది మొదలవుతుంది.