
మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు కదలడం లేదు. సాధారణంగా ఇలాంటి హాట్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరగాలి. అభిమానులు కూడా రకరకాల అప్డేట్లు ఆశిస్తారు. కానీ, ఈ సినిమా విషయంలో అలాంటివి జరగట్లేదు. దాంతో, ఈ మూవీ ఆగిపోయిందని ప్రచారం మొదలైంది.
మహేష్ బాబు సినిమాతో పాటు మరో పెద్ద సినిమా కూడా అటకెక్కింది అన్న వార్తల నేపథ్యంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుందని చెప్పారు.
మహేష్ బాబు లండన్ నుంచి సోమవారం హైదరాబాద్ కి వచ్చారు. ఈ వారంలో త్రివిక్రమ్… మహేష్ బాబుని కలిసి షూటింగ్ డేట్స్ గురించి మాట్లాడతారట. ఆ తర్వాత అభిమానులు కోరుకునే అప్డేట్లు ఉంటాయి.
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం. ఇంతకుముందు ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి.