ఓవర్సీస్ లో మహేష్ మరో రికార్డ్

sar

ఓవర్సీస్ లో మహేష్ బాబు మరో రికార్డ్ సృష్టించాడు. అతడు నటించిన సర్కారువారి పాట సినిమా యూఎస్ లో 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మహేష్ కు సంబంధించి 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన నాలుగో సినిమా ఇది. ఇలా నాలుగేసి సినిమాలతో 2 మిలియన్ డాలర్ క్లబ్ లో కొనసాగుతున్న సౌత్ హీరోలు మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు.

రజనీకాంత్, ప్రభాస్ కు చెందిన సినిమాలు చెరో నాలుగు, 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. అయితే అవన్నీ పాన్ ఇండియా సినిమాలు. ఓన్లీ తెలుగులో రిలీజై 2 మిలియన్ డాలర్ క్లబ్ వరకు వెళ్లడం ఒక్క మహేష్ కు మాత్రమే ఇప్పటివరకు సాధ్యమైంది.

ఇక మిగతా హీరోల విషయానికొస్తే.. ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలు, 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ హీరోల నుంచి చెరో రెండే సినిమాలు ఈ క్లబ్ లో ఉన్నాయి.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది సర్కారువారి పాట. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, కాస్త సందేశాత్మకంగా వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో హిట్ సినిమాగా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.

 

More

Related Stories