2025లోపు రెండు మాత్రమే!

Mahesh Babu


మహేష్ బాబు బాగా స్లో అయ్యారు. రెండేళ్లకు ఒక సినిమా వస్తోంది ఆయన నుంచి. 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’, 2022లో ‘సర్కారు వారి పాట. నెక్స్ట్ మూవీ మాత్రం 2023లోనే రావొచ్చు. కానీ అది సమ్మర్ కి విడుదల అవుతుందా దసరాకా? అన్నది ఇప్పుడే చెప్పలేం.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. ఆగస్టులో మొదలుపెట్టి వేసవి సెలవుల్లో విడుదల చేస్తామని ఇటీవలే నిర్మాతలు ప్రకటించారు. కానీ, ఇప్పుడు సినిమా షూటింగులు బంద్ పెట్టాలి అని చిత్రసీమలో హడావిడి నడుస్తోంది. అంటే, ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. అందుకే, వేసవి సెలవుల టైంకి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి.

ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందే మూవీ ఖచ్చితంగా వచ్చే ఏడాది మొదలవుతుంది. రాజమౌళి సినిమా అంటే మినిమమ్ రెండేళ్లు మేకింగ్ పడుతుంది. 2023, 2024 ప్రొడక్షన్ లో ఉంచి 2025లో విడుదల చేస్తారేమో.

ఈ లెక్కన వచ్చే మూడేళ్ళలో మహేష్ బాబు నుంచి రెండు సినిమాలు మాత్రమే వస్తాయి. రాజమౌళి సినిమా విడుదలయ్యాక కూడా ఆయన స్పీడ్ పెంచకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి మూవీతో చేసిన తర్వాత ఎలాంటి కథలు ఒప్పుకోవాలో తెలియక హీరోలు సతమతవుతుంటారు.

 

More

Related Stories