బోనస్ ప్రకటించిన మహేష్ బాబు

Mahesh Babu

టాలీవుడ్ ఆడియన్స్ కు బోనస్ ప్రకటించాడు మహేష్ బాబు. సర్కారువారి పాట సినిమా చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు బంపరాఫర్ ఇచ్చాడు. ఇప్పుడా సినిమాకు మరో కొత్త పాట యాడ్ అయింది. ఆల్రెడీ థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు, ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు సర్కారువారి పాట సినిమాలో ఈ అదనపు సాంగ్ ను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సర్కారువారి పాటకు థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రేక్షకుల్ని మరోసారి థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ ఇలా కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. ఇది ఏ మేరకు సత్ఫలితాల్ని అందిస్తుందో చూడాలి. ఈ పాటపై ఇప్పటికే తమన్ చాలా చెప్పుకొచ్చాడు. తన కెరీర్ బెస్ట్ వర్క్స్ లో ఈ పాట కూడా ఒకటన్నాడు. మురారి వా.. అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ లో మహేష్-కీర్తిసురేష్ కెమిస్ట్రీ మరో అదనపు ఆకర్షణ అంటున్నాడు.

మరోవైపు సర్కారువారి పాట సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే సబ్ స్క్రైబర్లు ఈ సినిమా చూడాలంటే, అదనంగా ఇంకొంత చెల్లించాలి. ఇంతకుముందు కేజీఎఫ్-2కు కూడా ఇదే పద్ధతి ఫాలో అయింది అమెజాన్. ఇప్పుడు సర్కారువారి పాటతో దీన్ని కొనసాగించింది.

అమెజాన్ లో పే పర్ వ్యూ మోడల్ లో వచ్చిన ఈ సినిమా, థియేట్రికల్ రన్ కు చెక్ పెడుతుందని చాలామంది భావిస్తున్నారు. పరశురామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

 

More

Related Stories