దుబాయ్ లో ఇల్లు రిజిస్ట్రేషన్ కోసమే

Mahesh Babu

మహేష్ బాబు మరోసారి విదేశాలకు వెళ్లారు. ఐతే, ఇది ఇంకో వెకేషన్ కాదంట. నిన్న ఆయన, ఆయన భార్యాపిల్లలు దుబాయ్ కి వెళ్లారు. అక్కడే మూడు, నాలుగు రోజులు ఉంటారట. ఈసారి వెళ్లిన కారణం ఇల్లు రిజిస్ట్రేషన్.

దుబాయిలోని ఒక విలాసవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు ఒక విల్లా కొన్నారట. బీచ్ సైడ్ విల్లా ఇష్టపడి తీసుకున్నారని టాక్. గత కొన్నాళ్లుగా ఆయన తరుచుగా దుబాయ్ వెళ్తున్నారు. అక్కడి లైఫ్ స్టయిల్, ప్రశాంతత నచ్చిందిట. అందుకే, విల్లా కొన్నారు.

ఇప్పుడు దాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్, అధికారిక పత్రాలు తీసుకోవడం వంటి పనులున్నాయి. అందుకే, అవి పూర్తి చేసేందుకు దుబాయ్ వెళ్లినట్లు టాక్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తన సినిమా షూటింగ్ మొదలుపెడుతారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ఆగిపోయింది అని ఇటీవల ఒక వెబ్ సైట్ జర్నలిస్ట్ స్ప్రెడ్ చేసిన గాసిప్ ని నిర్మాతలు తోసిపుచ్చారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఐతే, ఈ సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబుకి మధ్య కొంత డిఫరెన్సెస్ ఉన్న మాట వాస్తవమే.

 

More

Related Stories