మహేష్ కి దుబాయ్ లోనే అంటింది!

- Advertisement -
Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఐతే, ఆయనకి హైదరాబాద్ లో కరోనా సోకలేదు. దుబాయ్ లోనే వచ్చిందట. దుబాయ్ లో మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు, వారి మిత్రబృందం కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలింది. అక్కడే కరోనా సోకింది.

మహేష్ బాబు టీంలో కూడా చాలా మందికి వచ్చిందట. ఇటీవల దుబాయ్ కి వెళ్లి వచ్చిన సినిమా తారలందరూ కరోనాతో డౌన్ అయ్యారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ఆ బాధితుడే.

‘సర్కారు వారి పాట’ షూటింగ్ ని ఈ నెలాఖరులో మళ్లీ షురూ చేస్తారట. అప్పటివరకు షూటింగ్ పనులు ఆగిపోయినట్లే. సంక్రాంతికి మొదటి పాట విడుదల చేద్దామని భావించింది టీం. ఐతే, అటు హీరో మహేష్ బాబు, ఇటు సంగీత దర్శకుడు కరోనా నుంచి కోలుకుంటేనే పాటల ప్రొమోషన్ సాధ్యం అవుతుంది.

ఈ ఏడాది మహేష్ బాబు రెండు సినిమాలు విడుదల చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాదు. ‘సర్కారు వారి పాట’ ఒక్కటే ఈ ఏప్రిల్ లో విడుదల అవుతుంది. త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం 2023లో రిలీజ్ కానుంది.

 

More

Related Stories