అవి పుకార్లే అని తేల్చిన మహేష్

Mahesh Babu

మహేష్ బాబు “సర్కార్ వారి పాట” సినిమాని పక్కన పెట్టి మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు అని ఇటీవల కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. “సర్కార్ వారి పాట” చాలా లేట్ గా స్టార్ట్ అవుతుందని, ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో మూవీ మొదలుపెడుతాడని రాశాయి. కానీ, మహేష్ బాబు తాజా ట్వీట్ తో అలాంటిదేమి లేదని కొంత క్లారిటీ వచ్చినట్లే.

కీర్తి సురేష్ పుట్టిన రోజు నాడు ఆమెకి బర్త్ డే విషెస్ తెలిపారు మహేష్ బాబు. అదే ట్వీట్లో, ఆమె “సర్కారు వారి పాట” సినిమాలో నటిస్తున్నట్లు తెలిపాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది కూడా మహేష్ బాబు త్వరలోనే కన్ ఫమ్ చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ తో సినిమా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ “సర్కార్ వారి పాట” మాత్రం యధావిధిగా స్టార్ట్ అయ్యేలా ఉంది.

“సర్కార్ వారి పాట” సినిమాకి పరుశరామ్ దర్శకుడు. త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటించనున్నాడు. ఈ గ్యాప్ లో రెండు కానీ, మూడు సినిమాలు కానీ ఫినిష్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేశాడు మహేష్ బాబు. ఐతే, కరోనా అన్ని ప్లాన్స్ ని ఉల్టా పల్టా చేసింది. రాజమౌళి “ఆర్. ఆర్. ఆర్” ముగించుకొని మహేష్ బాబుతో సినిమా మొదలు పెట్టడానికి మరీ లేట్ ఐతే తప్ప .. ఈ గ్యాప్ లో మూడు సినిమాలు చెయ్యడం మహేష్ కి కుదరదు. రెండు సినిమాలు మాత్రం గ్యారెంటీ.

సర్కారు వారి పాట కాకుండా… మహేష్ బాబు చేసే ఆ మరో చిత్రం ఏదవుతుందో అనేది చూడాలి.

Related Stories