‘కృష్ణా’లో కృష్ణ అస్థికలు

Krishna

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను మహేష్ బాబు ఈ రోజు కృష్ణానదిలో కలిపారు. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మ నిలయం వద్దకి వచ్చి శాస్త్రోక్తంగా అస్థికలను నదిలో కలిపారు.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టింది, పెరిగింది కృష్ణా నది పరివాహక ప్రాంతమైన గుంటూరు జిల్లాలో. అందుకే, కృష్ణాలోనే అస్థికలను కలిపారు. మహేష్ బాబుతో పాటు ఆయన బావ గల్లా జయదేవ్, కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు కూడా ఉన్నారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ కూడా మహేష్ బాబు వెంటే ఉన్నారు.

గత మంగళవారం కన్నుమూశారు కృష్ణ. హైదరాబాద్ లోనే ఈ వారం దశదిన కర్మ నిర్వహిస్తున్నారు. అభిమానులని కూడా రమ్మని పిలిచారు.

మరోవైపు, మహేష్ బాబు తన కొత్త చిత్రం షూటింగ్ ని జనవరి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది.

 

More

Related Stories