
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ ఇచ్చి బ్రిటిష్ కర్రీ ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు. భార్యా పిల్లలతో కలిసి మరోసారి విహారయాత్రకి వెళ్లారు. లండన్ లో కొందరి మిత్రులతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోలను నమ్రత మహేష్ షేర్ చేశారు.
మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ “గుంటూరు కారం” సినిమా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా అనేక సమస్యలు ఎదుర్కొంది. తాజాగా కెమెరామెన్ తప్పుకోవడంతో షూటింగ్ ని అర్ధాంతరంగా నిలిపివేశారు.
దాంతో, ఖాళీ దొరికింది అని మరోసారి విహారయాత్రకి వెళ్లారు మహేష్ బాబు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో గడపడాన్ని ఇష్టపడుతారు. అందుకే, టైం దొరికితే చాలు విదేశాలకు వెళ్తారు.