- Advertisement -

మహేష్ బాబు అందం, ఆయన స్కిన్ కలర్ టోన్ కి ఫిదా కానీ వాళ్లున్నారా? రౌడీ బేబీ సాయి పల్లవి కూడా అదే మాట చెప్తోంది. మహేష్ బాబు గురించి ఒక మాట చెప్పమని ఒక ఇంటర్వ్యూలో అడిగితే గడగడా చెప్పేసింది. “ఆమ్మో… మామూలు హ్యాండ్సమ్ గా ఉండడు. అసలు మచ్చలేని స్కిన్. నేను ఒక్కోసారి ఆయన ఫోటోలు జూమ్ చేసి చూసి ఆశ్చర్య పోతుంటా… ఆ టోన్ కి, ఆ స్పాట్ లెస్ స్కిన్ కి,” అని టకా టకా తన అభిమానాన్ని చాటుకొంది.
అంతేకాదు, “ఒక మనిషి అంత అందంగా ఉండడం అసాధ్యం అనుకుంటాం. కానీ మనకి మహేష్ ఉన్నాడు,” అని సిగ్గుపడుతూ చెప్పింది.
సాయి పల్లవి ప్రస్తుతం “విరాట పర్వం” సినిమాలో నటిస్తోంది. అలాగే నాని సరసన “అంటే సుందరానికి” అనే నటించనుంది.