
రాజమౌళి ఒక సినిమా మొదలు పెడితే ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయన సినిమాల్లో నటించే హీరోలు మినిమమ్ రెండేళ్ల డేట్స్ ని రాజమౌళికి ఇచ్చేయాలి. రెండు, మూడేళ్లు ఇంకో సినిమా చేసేందుకు అవకాశం దక్కదు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ విషయంలో అలాగే జరిగింది.
అదే భయం మహేష్ బాబుకి ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కే మొదటి సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే, ఆ సినిమా స్టార్ట్ అయ్యేలోపు కనీసం మూడు సినిమాలు చెయ్యాలి అనుకున్నారు మహేష్ బాబు. ఐతే, కరోనా వచ్చి అన్ని ప్లాన్లను తారుమారు చేసింది. ఇప్పుడు మహేష్ బాబుకి క్లారిటీ వచ్చింది. మూడో సినిమా చేసేందుకు గ్యాప్ రాదని అర్థమైంది.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు. ఇది పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ షురూ అవుతుంది. వచ్చే ఏడాది మేలోపు త్రివిక్రమ్ సినిమా పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం మేకోవర్ చెయ్యాలి. సో, మహేష్ కి ఇంకో సినిమా చేసే ఛాన్స్ దొరకదు.
రాజమౌళి సినిమా నిజంగా వచ్చే ఏడాది మొదలైతే, అది 2024లోనే రిలీజ్ అవుతుంది.