బిల్ గేట్స్ ని కలిసిన మహేష్ బాబు


మహేష్ బాబుకి టైం దొరికితే చాలు వెకేషన్ కి వెళ్లుతారు. సమ్మర్ హాలిడేస్ కోసమని మేలో యూరోప్ వెళ్లిన మహేష్ బాబు జూన్ నెలాఖరు వరకు వెకేషన్ కంటిన్యూ చేశారు. బహుశా మహేష్ బాబు పిల్లలకు వాళ్ళ స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా అనుమతి ఇస్తోంది కాబోలు. వేసవి సెలవులు ముగిసి రెండు వారాలు అయింది. అయినా… మహేష్ బాబు, ఆయన భార్య, పిల్లలు ఈ రోజు వరకు అమెరికా, యూరోప్ ట్రిప్పులో ఉన్నారు.

న్యూయార్క్ లో ఆయన మైక్రోసాప్ట్ ఫౌండింగ్ చైర్ పర్సన్, టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ని కలిశారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోని మహేష్ బాబు షేర్ చేశారు.

ఈ వీకెండ్ మహేష్ బాబు హైదరాబాద్ కి వస్తారు. రాగానే, ఆయన తన తదుపరి చిత్రంపై ఒక నిర్ణయం తీసుకోవాలి.

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమా లాంచ్ అయింది. కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. మొన్నామధ్య త్రివిక్రమ్ జర్మనీ వెళ్లి మహేష్ బాబుకి స్టోరీ నేరేట్ చేశారు. అప్పుడు కొన్ని మార్పులు కోరారట మహేష్. ఇప్పుడు రాగానే, ఆయన త్రివిక్రమ్ ఇచ్చే ఫైనల్ నేరేషన్ విని డేట్స్ ఫిక్స్ చెయ్యాలి.

ఆగస్టులో కానీ, జులై చివర్లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

 

More

Related Stories