మహేష్ పై మొదలైన పుకార్లు

Mahesh Babu


మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా త్వరలోనే మొదలు కానుంది. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ, ఈ లోపు ఈ సినిమా గురించి ఎన్నో పుకార్లు మొదలయ్యాయి. మహేష్ బాబుతో పాటు ఇంకో పేరొందిన హీరో నటిస్తాడని మొదట ప్రచారం జరిగింది. అది తప్పని తేలడంతో ఇపుడు ఇంకో పుకారు.

అలాగే, ఇది రాజకీయ నేపథ్యంగా సాగే చిత్రమని, ఇందులో మహేష్ బాబు ఒక రాజకీయనాయకుడిగా నటిస్తున్నాడని ప్రచారం చేశారు. మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడనేది తాజా వైరల్ న్యూస్. కానీ ఇది కూడా తప్పే. మహేష్ బాబు అలాంటి ప్రయోగం చెయ్యడం లేదు.

త్రివిక్రమ్ ఇంతవరకు ఏ సినిమాలో కూడా హీరోని రెండు పాత్రల్లో చూపించలేదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేలోపు మరికొన్ని పుకార్లు రావడం ఖాయం.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

More

Related Stories