మహేష్ ఇంకా వర్కవుట్ చెయ్యాలి!

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే జర్మనీ వెళ్లి వచ్చారు. జర్మనీలో ఒక డాక్టర్ వద్ద రెండు వారాల శిక్షణ తీసుకున్నారు. గాయాలతో బాధపడుతున్న వారు లేదా కొన్ని రకాల ఎక్సర్ సైజులు చేస్తుంటే నొప్పితో బాధపడేవారికి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడంలో ఈ డాక్టర్ స్పెషలిస్ట్. అందుకే ఆయన వద్ద రెండు వారాల పాటు మహేష్ బాబు ఫిట్నెస్ టెక్నీక్స్ నేర్చుకున్నారు.

ఐతే, ఇంతటితో అయిపోలేదు. మహేష్ బాబు మరింతగా కసరత్తులు చెయ్యాలంట. ఇదంతా రాజమౌళి కొత్త చిత్రం కోసమే. ఆ సినిమాలో పోషించే పాత్రకి సిద్ధమవుతున్న మహేష్ బాబు ఫిట్నెస్ సాధించేందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాహసిగా కనిపిస్తారు. ప్రపంచంలోని ఎన్నో కష్టతరమైన ప్రదేశాల్లో హీరో సాహసాలు చేస్తున్నట్లు రాజమౌళి చూపించనున్నారు. దానికోసం మహేష్ బాబు ఇలా ఫిట్ నెస్ సాధించనున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఒక విదేశీ భామ నటించే అవకాశం ఉంది.

ఈ సినిమా షూటింగ్ వేసవి సెలవుల తర్వాత మొదలవుతుంది. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

Advertisement
 

More

Related Stories