
సూపర్ స్టార్ మహేష్ బాబుకి గతవారం కరోనా వచ్చింది. ఆయన ప్రస్తుతం క్వారెంటైన్లో ఉన్నారు. కరోనా కారణంగా తన అన్నయ్య కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోయారు మహేష్. హృదయ విదారకమైన దృశ్యం ఇది.
శనివారం రాత్రి సొదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు కన్నుమూశారు. ఆదివారం హైద్రాబాద్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఘట్టమనేని కుటుంబానికి మహేష్ బాబు మెయిన్ పిల్లర్. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నడవలేని పరిస్థితిలో ఉన్నారు. తనే ముందుండి అన్నయ్య అంత్యక్రియలు నిర్వహించాల్సిన మహేష్ కి క్వారెంటైన్ నుంచి బయటికి రాలేని పరిస్థితి.
వాట్సప్ వీడియో కాల్ లో అన్నను కడసారి చూసుకున్నారు మహేష్. తన వదిన, పిల్లలకు వీడియోలోనే ధైర్యాన్ని చెప్పారు. మహేష్ బాబు పరిస్థితి వారి కుటుంబసభ్యులను, అభిమానులని కలిచివేసింది.
వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ రమేష్ బాబుకి సోదరుడిగానే పుట్టాలనుకుంటున్నట్లు మహేష్ బాబు తన అన్నయకి సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు.