- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “సర్కారు వారి పాట” షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుంది. ఆ తర్వాత మరో సినిమాని కూడా పట్టాలెక్కించేందుకు మహేష్ బాబు ప్రయత్నాలు రెడీ అవుతున్నాడు. రాజమౌళి డైరెక్క్షన్లో సినిమా 2022 సమ్మర్ తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో మరో రెండు సినిమాలు పూర్తి చెయ్యాలనేది మహేష్ బాబు ఆలోచన.
“సర్కారు వారి పాట” ఆగస్టులో విడుదల కానుంది. ఆగస్టులోనే మరో సినిమా కూడా మొదలవ్వాలి అనుకుంటున్నాడు.
త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాలనేది మహేష్ బాబు ఆలోచన. దానికోసం చాలా ట్రై చేశాడు. కాని అది కుదరడం లేదు. సో… మళ్ళీ యువ దర్శకులకే ఛాన్స్ ఇస్తాడట. సో… ఇప్పుడు ఈ యువ దర్శకులు మంచి కథతో మహేష్ బాబు వద్దకు రావాలి. కథ ముఖ్యం అంటున్నాడు మహేష్.