మహేష్ బాబు వచ్చాడు, పొగిడాడు!

మహేష్ బాబు యూరోప్, అమెరికా ట్రిప్పు నుంచి వచ్చాడు. ఈ సారి సమ్మర్ వెకేషన్ అంటూ నెలన్నర రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసింది మహేష్ బాబు కుటుంబం. మహేష్ బాబు ఎప్పుడూ వెకేషన్ కి వెళ్లి వచ్చినా మొదట చేసే పని… ఆ గ్యాప్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు చూడడం.

న్యూయార్క్ నుంచి హైదరాబాద్ కి రాగానే మహేష్ బాబు అదే పని చేశారు. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో, రాగానే ఈ సినిమాని తన ఇంట్లో ఉన్న థియేటర్లో షో వేయించుకొని చూశారు మహేష్ బాబు. సినిమా నచ్చడంతో తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ని తెగ మెచ్చుకున్నారు. ఒక రోజు కూర్చొని మాట్లాడుకుందాం బ్రదర్ అంటూ డైరెక్టర్ కి ఆఫర్ ఇచ్చారు.

ఇక అందులో నటించిన విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లా ఎవరూ నటించలేరని పొగిడారు. అలాగే, తన అభిమాన నటుడు కమల్ హాసన్ కి సెల్యూట్ చెప్పారు. ఏ సినిమా నచ్చినా, లేదంటే పెద్ద హిట్ అయినా మహేష్ బాబు నుంచి ఒక పొగడ్త, ట్వీట్ రావడం ఖాయం.

దాదాపుగా ప్రతి తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చూస్తారట ఆయన.

 

More

Related Stories