బాబు పంచ్ వేస్తే!

Mahesh Babu


మహేష్ బాబు నిజజీవితంలో పంచ్ మాస్టర్. బాగా సెటైర్లు వేస్తారు. అది ఇండస్ట్రీ సర్కిల్లో తెలిసిన నిజం. హీరోలు, దర్శకులు ఎవరూ ఆయన సెటైర్ల నుంచి తప్పించుకోలేదు ఇప్పటివరకు. మహేష్ బబులోని ఈ యాటిట్యూడ్ ని పట్టుకున్నారట దర్శకుడు పరశురామ్ తన సినిమాకి. ‘సర్కారు వారి పాట’ సినిమాలో తన పాత్రని మలిచిన తీరు మహేష్ బాబుకి కూడా బాగా నచ్చిందట.

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు వేసే పంచ్ లైన్స్ … ఆయన రియల్ లైఫ్ లో వేసినట్లే ఉంటాయట. ఈ సినిమాలో మహేష్ బాబు వేసే పంచ్ లైన్స్ అదుర్స్ అని చెప్తున్నారు దర్శకుడు. ఆయన, వెన్నెల కిశోర్ మధ్య ఉండే ట్రాక్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందట.

మహేష్ బాబు ఇప్పటివరకు ‘దూకుడు’ వంటి సినిమాలో ఇలాంటి పాత్ర పోషించారు.

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు మనీ రికవరీ చేసే వ్యక్తిగా కనిపిస్తారు. బ్యాంక్ స్కామ్ లకు మధ్యతరగతి వాళ్ళు బలి అయ్యే ఎలిమెంట్ ని ఈ సినిమాలో చూపించారట.

 

More

Related Stories