వెకేషన్ నుంచొచ్చిన మహేష్ బాబు

Mahesh Babu

మహేష్ బాబు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. 2024 కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి విచ్చేశారు.

ఈ రోజు “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనాలి అనుకున్నారు మహేష్ బాబు. ఐతే, పోలీసులు ఈవెంట్ కి అనుమతి ఇవ్వలేదు. దాంతో ఈవెంట్ వాయిదా పడింది. కొత్త తేదీ, కొత్త వేదిక ఫిక్స్ చేస్తారు ఇప్పుడు.

ఇక మహేష్ బాబు ఈ సినిమా ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ జరగలేదు. పాటలు పెద్దగా హిట్ కాలేదు. పైగా ట్రోలింగ్ ఎక్కువ జరిగింది. ఐతే, నిర్మాతలు మాత్రం భారీ ఎత్తున విడుదల చేస్తూ హడావిడి చేస్తున్నారు.

“గుంటూరు కారం” విడుదలైన మూడు నెలల గ్యాప్ తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీ అయిపోతారు మహేష్ బాబు. ఇప్పటికే ఆ సినిమా కోసం తన బాడీని సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement
 

More

Related Stories