బాగా సన్నబడిపోతున్న సూపర్ స్టార్

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో విహార యాత్రలో ఉన్న విషయం సోషల్ మీడియాని బాగా ఫాలో అయ్యేవారికి తెలుసు. ఆయన భార్య నమ్రత తమ టూర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు ఇన్ స్టాగ్రామ్ లో. తాజాగా షేర్ చేసిన ఫొటోలో మహేష్ బాబు కొంచెం గడ్డం పెంచి కనిపించారు. అలాగే బాగా సన్నబడ్డట్లు కనిపిస్తోంది.

మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హ్యాండ్సమ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువగా డైట్ మైంటైన్ చేస్తున్నట్లు ఉన్నారు. బాగా స్లిమ్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది. ముఖం కూడా కొంచెం పాలిపోయింది.

మరోవైపు, గడ్డం, మీసం కొంచెం పెంచిన ఈ లుక్ చూసి ఇది తన తదుపరి చిత్రం కోసమే అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. కానీ, ఇప్పటివరకు దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ గెటప్ గురించి ఇంకా చర్చించలేదట.

మహేష్ బాబుకి ప్రస్తుతం 47 ఏళ్ళు. కానీ, ఆయన ఇంకా 40లోకి ఎంట్రీ ఇవ్వని వాడిలానే కనిపిస్తారు. మహేష్ బాబు అందం గురించి ఎవరికీ కంప్లైంట్స్ లేవు కానీ మరీ ఎక్కువ డైట్ చేసి అతిగా సన్నబడుతున్నట్లు మాత్రం అగుపిస్తోంది.

 

More

Related Stories