పాముని చూసి దడుసుకున్న మహేష్

Sarkaru Vaari Paata


సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయటపెట్టాడు. మహేష్ బాబుకి కూడా కొన్ని భయాలున్నాయట. అందులో ప్రధానమైనది… పాముల భయం.

ఒకప్పుడు మహేష్ బాబు రెగ్యులర్ గా కేబీఆర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్లేవారట. ఒక రోజు అలానే వెళ్లారు. ఐదు కిలోమీటర్ల రౌండ్ వేసిన తర్వాత ఎదురుగా పాము కనపడిందట. అంతే… ఫీచేమూడ్. అటు నుంచి ఆటే మళ్ళీ వెనక్కి 5 కిలోమీటర్లు వెళ్ళాడట. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు.

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’లో ఈ విషయాలు చెప్పారు మహేష్ బాబు. పాములను చూసి మహేష్ దడుసుకుంటారు అన్నమాట.

మహేష్ బాబు సినిమా సెట్ లో అందరిపై సెటైర్లు వేస్తారు. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు. అది కరెక్ట్ అని మహేష్ అంగీకరించారు.

 

More

Related Stories