‘మెయిటైనెన్స్ తో దూల తీరిపోతోంది’

- Advertisement -
Mahesh Babu


మహేష్ బాబుకి 47 ఏళ్ళు అంటే నమ్మలేం. ఇప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలా ఉంటారు. ఇన్నేళ్లు వచ్చినా అదే అందం. అసలు అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారో. ఇదే అందరికీ అనుమానం. దానికి సమాధానం ఇచ్చారు మహేష్ బాబు.

తాజాగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ లో తన అందం గురించి ఆయన సెటైర్ వేసుకున్నారు.

మహేష్ బాబు: ఏమయ్యా కిశోర్ మనకేమైనా మేరేజ్ చేసుకునే వయసొచ్చిందంటావా?
వెన్నెల కిషోర్: ఊరుకోండి సార్! మీకు అప్పుడే పెళ్లేంటి. చిన్నపిల్లాడు ఐతేనూ!
మహేష్ బాబు: అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా… దీనమ్మా మైంటైన్ చెయ్యలేక దూల తీరిపోతోంది.

అదన్నమాట. మహేష్ బాబు అందగాడే. కానీ అలా ఉండడానికి పాపం ఆయన చాలా కష్టపడాల్సి వస్తోందన్నమాట.

Sarkaru Vaari Paata Official Trailer | Mahesh Babu | Keerthy Suresh | Thaman S | Parasuram Petla
 

More

Related Stories