తమన్నాతో మహేష్ షూటింగ్ పూర్తి

మహేష్ బాబు, తమన్న కలిసి నటించిన యాడ్ షూటింగ్ నేటితో పూర్తి అయింది. ఈ యాడ్ ని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీశాడు. హావెల్స్ బ్రాండ్ కి చెందిన సమ్మర్ ప్రొడక్ట్స్ ప్రచారం కోసం ఈ యాడ్ కమర్షియల్ చిత్రీకరించారు. సందీప్ వంగాకి భారీ మొత్తం ఇచ్చి ఈ యాడ్ ని డైరెక్ట్ చేయించడం విశేషం.

తమన్న, మహేష్ బాబు ఒక యాడ్ కలిసి చెయ్యడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు, ‘ఆగడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది తమన్న. అలాగే, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.

More

Related Stories