ట్వీట్ తో చెక్ పెట్టిన మహేష్

- Advertisement -
Khaleja working still

మహేష్-త్రివిక్రమ్ కు పడట్లేదంట. స్వయంగా నమ్రత సీన్ లోకి ఎంటరై రాజీ కుదిర్చారట. ఈమధ్య కాలంలో ఇలాంటి పుకార్లు చాలానే ఉన్నాం. కానీ దీనిపై ఇటు మహేష్ నుంచి లేదా అటు త్రివిక్రమ్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఎట్టకేలకు దీనిపై చిన్నపాటి క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ తో తనకు ఎలాంటి సమస్య లేదని మహేష్ ఇన్-డైరక్ట్ గా క్లారిటీ ఇచ్చేశాడు.

ఇవాళ్టికి “ఖలేజా” సినిమా విడుదలై 10 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా మహేష్ ట్వీట్ చేశాడు. నటుడిగా తనలో ఓ కొత్త కోణాన్ని ఆ సినిమా చూపించిందని చెబుతూనే.. త్రివిక్రమ్ కు థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు.. త్రివిక్రమ్ తో మూవీ కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలోనే అది సాకారం అవుతుందంటూ ట్వీట్ చేశాడు.

ఈ ఒక్క ట్వీట్ తో ఇన్నాళ్లూ మహేష్-త్రివిక్రమ్ మధ్య నలిగిన పుకార్లు, వచ్చిన కథనాలు పటాపంచలైపోయాయి. త్రివిక్రమ్ ను గుడ్ ఫ్రెండ్ గా సంభోదించడంతో పాటు.. బ్రిలియంట్ అంటూ పొగిడేశాడు మహేష్.

 

More

Related Stories