
ఈ నెల 9న మహేష్ బాబు పుట్టిన రోజు. ప్రతి ఏడాది ఆగస్టు 9 వస్తోంది అనగానే మహేష్ బాబు అభిమానులు భారీ ఎత్తున హడావిడికి సిద్ధం అవుతుంటారు. ఐతే, ఈ సారి తన బర్త్ డేని మహేష్ బాబు విదేశాల్లోనే కుటుంబ సభ్యులతో జరుపుకోనున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, ఆయన భార్యాపిల్లలు లండన్ లో ఉన్నారు. అక్కడే బర్త్ డే సంబరాలు.
పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ పూర్తి అయ్యాకే మహేష్ బాబు హైదరాబాద్ వస్తారట.
ఈసారి మహేష్ బాబు పుట్టిన రోజు నాడు “గుంటూరు కారం” సినిమాకి సంబంధించిన మొదటి పాట విడుదల అవుతుంది అని భావించారు. కానీ, షూటింగ్ లో జాప్యం, ఇతర కారణాల వల్ల ఆ పాట విడుదల కావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కుంటున్నారు. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా గురించి ఏదైనా అప్డేట్ రావొచ్చు అని అభిమానులు భావిస్తున్నారు.
బహుశా రాజమౌళి మహేష్ బాబుకి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా ప్రారంభమ గురించి ఏదైనా ప్రకటన చేస్తారు కాబోలు.