మళ్ళీ విదేశాలకు… రకరకాల ఊహాగానాలు

Mahesh Babu


మహేష్ బాబు ఏడాదికి నాలుగు, ఐదు సార్లు విదేశాలకు వెళ్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే చాలా సార్లు ఫారిన్ వెకేషన్ కెళ్లారు. వచ్చేవారం మరోసారి వెళ్తున్నారు. రెండు వారాలు అక్కడే ఉంటారు.

త్రివిక్రమ్ తో సినిమా ఉండగానే మధ్యలో ఆయన బ్రేక్ తీసుకొని వెళ్తుండడంతో రకరకాల పుకార్లకు కారణమైంది. హెల్త్ చెకప్ కోసం ఫారిన్ వెళ్తున్నారు అని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ తో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని, వాటిని కరెక్ట్ చెయ్యమని త్రివిక్రమ్ కి మరోసారి టైం ఇచ్చాడని మరో వెబ్ సైట్ రాసింది.

ఇలాంటి ఊహాగానాలు, పుకార్లు ఎలా ఉన్నా, త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా షూటింగ్ నవంబర్ మొదటివారంలో మొదలవుతుంది. మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నది వాస్తవం. కొత్త షెడ్యూల్ పెద్దదే. త్రివిక్రమ్ తన పనిలో ఉన్నారు.

మరోవైపు, మహేష్ బాబు – రాజమౌళి మూవీ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత లాంఛనంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories