ఈసారి జర్మనీలో కథా చర్చలు

Mahesh Babu

ఒకప్పుడు కథా చర్చల కోసం అరకు లాంటి ప్రదేశాలకు వెళ్లేవారు. ఆ తర్వాత రిసార్టులకు మారారు. ఆ తర్వాత గోవాకు షిఫ్ట్ అయ్యారు. మధ్యలో బ్యాంకాక్ కూడా వచ్చి చేరింది. అలా స్టోరీ డిస్కషన్స్ కోసం దేశాలు దాటడం మొదలైంది. ఇప్పుడీ కల్చర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు మహేష్ బాబు. జర్మనీలో స్టోరీ డిస్కషన్స్ పెట్టాడు.

త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో జాలీగా గడిపేందుకు జర్మనీ వెళ్లాడు. దీంతో త్రివిక్రమ్ కూడా జర్మనీ వెళ్లాడు. అక్కడే మహేష్ తో సినిమాకు సంబంధించి తుది చర్చలు జరిపాడు. ఇండియా వచ్చిన తర్వాత మళ్లీ టైమ్ వేస్ట్ అవుతుందనే ఉద్దేశంతో, త్రివిక్రమ్ అక్కడకు వెళ్లాడన్నమాట.

త్రివిక్రమ్ తో పాటు మ్యూజిక్ డైరక్టర్ తమన్ కూడా జర్మనీ వెళ్లాడు. సినిమాలో ఎలాంటి సందర్భాల్లో పాటలు వస్తాయి, ఏ పాటకు ఏ కంపోజిషన్ అయితే బాగుంటుంది లాంటి అంశాల్ని కూడా మహేష్ తో చర్చించారట. వీళ్లిద్దరితో పాటు బడ్జెట్ గురించి మాట్లాడ్డానికి నాగవంశీ కూడా వెళ్లారట.

ఇలా మహేష్ తో స్టోరీ డిస్కషన్ కోసం నిర్మాత-దర్శకుడు-సంగీత దర్శకుడు ఏకంగా జర్మనీ వెళ్లారు. ఇదంతా సినిమాలో జాప్యాన్ని నివారించడం కోసమేనట. 

 

More

Related Stories