మహేష్ బాబు ఫ్యాన్స్ లిస్ట్ ఇదే

Mahesh Babu

ఒక సినిమా పూర్తయ్యేంతవరకు నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ఇవ్వడు మహేష్. ప్రస్తుతం చేస్తున్న సినిమా దాదాపు పూర్తయిందని నిర్థారించుకున్న తర్వాతే మరో సినిమా ఎనౌన్స్ చేస్తాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం మహేష్ అంత కూల్ గా ఉండరు. వాళ్లు ఎప్పటికప్పుడు మహేష్ అప్ కమింగ్ మూవీస్ ను గెస్ చేస్తూనే ఉంటారు.

అయితే ఈసారి మహేష్ కు సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ ఏకంగా “లైనప్” సిద్ధం చేయడం విడ్డూరం. ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు రాబోయే 3-4 ఏళ్లలో మహేష్ ఏ సినిమాలు చేస్తాడో చెబుతూ ఆయన అభిమానుల ఫ్యాన్ పేజీల్లో ఓ మెసేజ్ జోరుగా తిరుగుతోంది.

ప్రస్తుతానికి “సర్కారువారి పాట” సినిమా మాత్రమే ప్రకటించాడు మహేష్. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడట. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. ఇక కెరీర్ లో తన 30వ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ ఉంటుందట.

ఇలా మహేష్ కంటే ముందే అతడి మూవీ లైనప్ ను ఫ్యాన్స్ ప్రకటించేశారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మహేష్ సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ ఆఖరి నిమిషంలో ఫైనల్ అవుతుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వంశీ పైడివల్లి. సరిలేరు నీకెవ్వరు తర్వాత పైడిపల్లితోనే సెట్స్ పైకి వెళ్లాలి. కానీ ఆఖరి నిమిషంలో పరశురామ్ వచ్చి చేరాడు.

సో.. మహేష్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడనేది చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఫ్యాన్స్ అలా సరదా పడుతుంటారంతే.

Related Stories