మహేష్, నమ్రత… అదే లవ్వు!

Mahesh and Namrata

మహేష్ బాబు, నమ్రత …దాదాపు 20 ఏళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. “వంశీ” సినిమా షూటింగ్ లో ఫస్ట్ టైం కలుసుకోవడం… సెట్ లోనే లవ్ లో పడడం …టకాటకా జరిగిపోయాయి. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు గౌతమ్ కి 14 ఏళ్ళు, కూతురు సితారకి 8 ఏళ్ళు. ఇన్నేళ్లయినా వారింకా ప్రేమ జంటగానే కనిపిస్తున్నారు.

“ప్రేమే జీవితంలో ముఖ్యం. అదే మనందరినీ కలిపి ఉంచుతుంది,”అని అంటున్నారు నమృత. తన భర్తతో ఈ లాక్దౌన్ టైంలో తీసుకున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ అయింది.

మహేష్ బాబుకి సంబందించిన అన్ని ప్రమోషన్ పనులు, బ్రాండ్స్ వ్యవహారాలు నమ్రత చూసుకుంటారు. మరోవైపు, మహేష్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. “సర్కార్ వారి పాట” సినిమా షూటింగ్ నవంబర్ నెలలో మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ మొదట అమెరికాలో స్టార్ట్ అవుతుంది.

Related Stories