బీజేపీలో చేరిన ‘తుపాన్’ మహి

- Advertisement -
Mahi Gill

ఇది ఎన్నికల సమయం. యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో, సినిమా గ్లామర్ కావాలి. ఎన్నికల టైంలో సినిమా తారలను ఆకర్షించడంలో బీజేపీ ముందుంటుంది. తాజాగా 46 ఏళ్ల నటి మహి గిల్ ని తమ పార్టీలోకి తీసుకొంది బీజేపీ.

అవును, ‘దేవ్ డి’ సినిమాతో పాపులర్ అయిన మహి గిల్ ఇప్పుడు రాజకీయతీర్థం పుచ్చుకున్నారు. వర్మ నిర్మించిన “నాట్ ఏ లవ్ స్టోరీ”, సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ “దబాంగ్” సినిమాల్లో నటించిన మహి గిల్ ఇప్పుడు ఫేడ్ అవుటైన తార. కానీ, గ్లామర్ భామ. సో, అది చాలు బీజేపీకి. ఆమెకి కూడా అధికారంలో ఉన్న పార్టీ అండదండలు అవసరం. సో, ఆమె పంజాబ్ లో బీజేపీ తరపున ప్రచారం చెయ్యనున్నారు.

నిన్న పంజాబ్ బీజేపీలో చేరారు మహి గిల్.

రామ్ చరణ్ నటించిన హిందీ మూవీ ‘జంజీర్’ (‘తుపాన్’)లో కూడా మహి గిల్ కీలక పాత్ర పోషించారు.

 

More

Related Stories