మేజర్ దర్శకుడికి అడ్వాన్స్ అందింది

Major

కాస్త విషయం ఉందని తెలిస్తే చాలు ఏ దర్శకుడ్ని నిర్మాత వదులుకోడు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటాడు. ఏదో ఒక టైమ్ లో, ఎలాగోలా సినిమా చేద్దాం అనే ఆలోచన నిర్మాతకు ఉంటుంది. సూపర్ హిట్స్ నుంచి ఓ మోస్తరు సక్సెస్ ఇచ్చిన దర్శకులెవ్వరూ ఖాళీగా లేరు. మేజర్ దర్శకుడికి కూడా అడ్వాన్స్ అందేసింది.

మేజర్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. చాలా టైమ్ ఈ సినిమా కోసమే కేటాయించాడు. కథ, మాటలు తనవి కాకపోయినా, బయోపిక్ కావడంతో రీసెర్చ్ ఎక్కువగా చేశాడు. అలా మేజర్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన శశికిరణ్.. తన నెక్ట్స్ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేయబోతున్నాడు.

సితార ఖాతాలో చాలామంది దర్శకులున్నారు. శశికిరణ్ కూడా ఆ ఖాతాలోనే ఉన్నాడు. ఈ బ్యానర్ పై సినిమా చేసేందుకు శశికిరణ్ సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ 2 కథలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ మేజర్ సినిమా రిలీజ్ తర్వాత చెబుతానంటున్నాడు. ఈ సీరియస్ సినిమాల దర్శకుడు, నెక్ట్స్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.

 

More

Related Stories