మేజర్ మూవీ రివ్యూ

తెలుగు మేకర్స్ కూడా ఈమధ్య బయోపిక్స్ తీస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ మేజర్ బయోపిక్ అనేది వాటికి డిఫరెంట్. ఇది రెగ్యులర్ బయోపిక్ కాదు. ఇది కేవలం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితానికి సంబంధించిన విషయం కాదు. ఇదొక వీరుడి గాధ. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ సైనికుడి సిసలైన కథ. పైగా దేశాన్ని కుదిపేసిన 26/11 దాడుల్ని చర్చించిన సినిమా ఇది. ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ లో జరిగిన ఉగ్రదాడి నుంచి బందీల్ని సందీప్ ఎలా విడిపించాడు, ఎలా వీరమరణం పొందాడనేది ఈ సినిమా.

సందీప్ అసలైన దేశభక్తుడు. కావాలంటే నా ప్రాణాన్ని ఇస్తాను, దేశాన్ని కాదు అని చెప్పగలిగిన వీర సైనికుడు. అతడు తన జీవితాన్ని కూడా అలానే గడిపాడు. జీవితంలో కూడా అదే స్ఫూర్తి చూపించాడు. బ్యాక్ అండ్ ఫోర్త్ నెరేషన్ లో సాగిన ఈ బయోపిక్ లో సందీప్ బాల్యం, కాలేజ్ లైఫ్, భార్యతో రొమాన్స్, తాజ్ హోటల్ ఆపరేషన్, ప్రాణత్యాగం లాంటి అంశాలన్నింటినీ టచ్ చేశారు. సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ గుండెలకు హత్తుకుంటుంది. అది చూసి ఎమోషనల్ అవ్వని ప్రేక్షకుడు బహుశా థియేటర్లో ఉండడేమో.

దర్శకుడు శశికిరణ్ తిక్క, రైటర్ గా శేష్ సందీప్ హీరోయిజంను చక్కగా ఎలివేట్ చేశారు. హోటల్ దాడి ఘటనలో సందీప్ ను చూపించిన విధానం, దేశభక్తి సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేశారు. ఓ నిజజీవితాన్ని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశామంటూ అడివి శేష్ సినిమా ప్రమోషన్ లో ఏం చెప్పాడో, ఆ మాటను అతడు నిలబెట్టుకున్నాడు. ఓ సైనికుడి వీరోచిత పోరాటం ఈ సినిమా.

అయితే సినిమా ఎంత ఎమోషనల్ గా ఆకట్టుకున్నప్పటికీ రెగ్యులర్ బయోపిక్స్ లో కనిపించే ఇబ్బందులు మేజర్ లో కూడా ఉన్నాయి. సినిమాటిక్ లిబర్టీ పేరిట సందీప్ కు హీరోయిజంను ఎక్కువగా చూపించడం, డ్రామా ఎక్కువగా మిక్స్ చేయడం లాంటివి ఈ సినిమాలో కూడా జరిగాయి. ఇదే ఉగ్రదాడిలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇతర కమాండోలు, ముంబయి పోలీసుల సాహసాల్ని మేజర్ చూపించలేకపోయింది. వాళ్లలో కొందరు సందీప్ లానే ప్రాణత్యాగం చేశారు కూడా. దీనికి తోడు సందీప్ రొమాంటిక్ లైఫ్, ఆ ముద్దు సీన్ అంత ఇంప్రెస్ చేయవు. అయితే సినిమా అసలు ఉద్దేశాన్ని, సినిమా విజయాన్ని ఇవి ఏమాత్రం ప్రభావితం చేయవు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి అందరికీ తెలిసిందే. ముంబయి ఉగ్రదాడిలో అతడు చూపించిన తెగువ, చేసిన ప్రాణత్యాగం గురించి చాలామందికి తెలుసు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా స్టోరీ గురించి రాయడం లేదు. మేజర్ సందీప్ గా అడివి శేష్ పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అతడి లుక్స్, పెర్ఫార్మెన్స్ సింప్లీ సూపర్. ప్రీ-క్లైమాక్స్ లో అడివి శేష్ జీవించేశాడు. అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

శేష్ తో పాటు ప్రకాష్, రేవతి తన సహజ నటనతో మెప్పించారు. కొడుకు చనిపోయాడని తెలిసినప్పుడు రేవతి నటన, ప్రకాజ్ రాజ్ ఫైనల్ స్పీచ్ గురించి ఇలా ఇక్కడ చెప్పుకోవడం కంటే, సినిమాలో చూసి తీరాల్సిందే. కొత్తమ్మాయి సయీ మంజ్రేకర్ కూడా కొన్ని సన్నివేశాల్లో మెప్పించిందంటే ఆ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాల్సిందే. మురళీ శర్మ, శోభిత తమ పాత్రలకు ఉన్నంతలో న్యాయం చేశారు.

Major

శశికిరణ్-శేష్ కు టెక్నీషియన్స్ నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు. గూఢచారిలోనే అది ప్రూవ్ అయింది. మేజర్ లో అది డబుల్ అయింది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ హైలెట్. ఇక శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే టెర్రిఫిక్ గా ఉంది. వీటితో పాటు సినిమా కోసం వేసిన తాజ్ మహల్ హోటల్ సెట్ అదిరిపోయింది. ఇలా బీజీఎం, ప్రొడక్షన్ వర్క్, సినిమాటోగ్రఫీ అన్నీ సరిగ్గా సింక్ అయ్యాయి. అబ్బూరి రవి రాసిన ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా శశికిరణ్ తిక్క, ఎమోషనల్ సీన్స్ తీసినప్పుడు తన టాలెంట్ చూపించాడు.

ఓవరాల్ గా మేజర్ బయోపికి, సందీప్ ఉన్నికృష్ణన్ కు ఘనమైన నివాళిగా నిలుస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్న చిన్న చిన్న నెగెటివ్ ఇష్యూస్ ను మినహాయిస్తే.. బలమైన ఎమోషన్స్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ కోసం ఈ సినిమాను తప్పకుండా చూడాలి.

By – పంచ్ పట్నాయక్

Rating: 3/5

 

More

Related Stories