ఊహించిందే…కానీ లేట్ అయింది!

- Advertisement -

ఇప్పుడు బాలీవుడ్ లో మార్మోగుతున్న మాట ఒక్కటే…. మలైక అరోరా, ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పుకున్నారని. గతంలో కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ, ఇప్పుడు ఏకంగా దాదాపు అన్ని పత్రికలు, వెబ్ సైట్లు, టీవీ ఛానెల్స్ ఈ వార్తలను ప్రముఖంగా స్ప్రెడ్ చేశాయి. అయినా, మలైకకానీ, అర్జున్ కపూర్ కానీ తోసిపుచ్చలేదు. వారి మౌనమే సమాధానం అని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

ఐతే, వీరి బ్రేకప్ వార్త ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. మలైకకి అర్జున్ కపూర్ ఎప్పుడో బ్రేకప్ చెప్తాడని చాలామంది ఊహించారు. అది లేట్ కావడమే కొంత ఆశ్చర్యం.

ఎందుకంటే, మలైక వయసు ఇప్పు 49 ఏళ్ళు. ఇంకో ఏడాదికి 50. ఆమెకి 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరి అర్జున్ కపూర్ వయసు 37. ఇద్దరి మధ్య 13 ఏళ్ల గ్యాప్. మలైక 40ల్లో ఉన్నప్పుడు అర్జున్ పరిచయమయ్యాడు. ఇప్పుడు ఆమె 50కి వచ్చినప్పుడు అతను ఇంకా 30ల్లోనే ఉంటున్నాడు. అదే వీరి మధ్య సమస్య. సో, ఏ రకంగా చూసినా వీరి బంధం ఎక్కువ కాలం నిలిచేది కాదు అని అందరూ అనుకున్నదే.

ALSO READ: Malaika Arora unfollows Janhvi Kapoor

ఐతే, మలైక 50కి దగ్గర్లో ఉన్నా మంచి ఫిజిక్ తో ఉంటుంది. నిత్యం యోగా, జిమ్ తో ఆమె అద్భుతంగా బాడీ మెయిన్ టైన్ చేస్తోంది.

 

More

Related Stories