పెళ్లి అవసరం లేదు: మలైక

Malaika Arora and Arjun Kapoor


మలైక, అర్జున్ కపూర్ పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. వీరి బ్రేకప్ గురించి కూడా ప్రచారం చాలా జరిగింది. ఐతే, ఇప్పటికీ ఈ జంట కలిసే ఉంది. తాజాగా తమ ప్రేమ బంధం ఎలా ఉందో చెప్తూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది మలైక. అర్జున్ కపూర్ తో దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అంతే కాదు, పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది. “అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకుంటానా లేదా అన్నది అనవసర రాద్ధాంతం. మేం చాలా ఏళ్లుగా జంటగా ఉంటున్నాము. మేం మానసికంగా భార్యాభర్తలం. పెళ్లి ఫార్మాలిటీ అవసరం లేదు,” మలైక చెప్పిన సమాధానం.

ఇద్దరి మధ్య 10 ఏళ్ల పైనే గ్యాప్ ఉంది. అర్జున్ కన్నా ఆమె పెద్దది. అందుకే, వీరి పెళ్లి అవకపోవచ్చు అని బాలీవుడ్ మీడియా రాస్తోంది. దాంతో, విసుగెత్తిన మలైక తన అభిప్రాయమేంటో బయటపెట్టింది.

ప్రస్తుతం మలైక పెద్దగా సినిమాలు చెయ్యడం లేదు. టీవీ షోలతో సంపాదిస్తోంది.

 

More

Related Stories