మలైకా కోలుకుంది!

తనకు కరోనా సోకినట్టు కొన్నాళ్ల కిందట స్వయంగా ప్రకటించాడు హీరో అర్జున్ కపూర్. దీంతో అంతా మలైకా వైపు చూశారు. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారు కాబట్టి మలైకాకు కూడా వైరస్ సోకి ఉంటుందని అనుమానించారు. అనుమానించినట్టుగానే మలైకాకు కూడా కరోనా సోకింది.

అలా మలైకా, అర్జున్ ఇద్దరూ హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. వైద్యుల సూచనల మేరకు మందులు వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మలైకాకు నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్టయింది.

తనకు కరోనా తగ్గిపోయిందని, చాలా రోజుల తర్వాత గది నుంచి బయటకొచ్చానని ప్రకటించింది మలైకా. అయితే ఆమె కంటే ఒక రోజు ముందే హోం ఐసొలేషన్ లోకి వెళ్లిన అర్జున్ మాత్రం తన హెల్త్ అప్ డేట్ ఇవ్వలేదు. రెగ్యులర్ గా తన హెల్త్ అప్ డేట్స్ ఇస్తానని చెప్పిమరీ అర్జున్ కపూర్ సైలెంట్ అయ్యాడు. అతడు కూడా త్వరగా కోలుకొని, మలైకా-అర్జున్ మరోసారి తమ సహజీవనాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని కోరుకుందాం.

Related Stories