- Advertisement -

ఈ రోజు ప్రేమికుల రోజు. వాలైంటెన్స్ డే నాడు హీరో, హీరోయిన్లు తమ లవర్స్ తో కూడిన ఫోటోలు షేర్ చేస్తుంటారు. 48 ఏళ్ల మలైక కూడా తన బాయ్ ఫ్రెండ్ ని కౌగిల్లో ఒదిగిన ఫోటోని షేర్ చేసింది.
మలైక చిన్న షార్ట్ వేసుకొని కనిపించింది ఈ ఫొటోలో.
హీరో అర్జున్ కపూర్ ఆమె ప్రియుడు. ఆమె కన్నా 12 ఏళ్ళు చిన్నవాడు. వీరిద్దరూ బ్రేకప్ దిశగా వెళ్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. అది తప్పు అని ప్రూవ్ చేస్తూ ఇప్పటికే ఫోటోలు, సందేశాలు పెట్టారు. ఈ రోజు ఫోటోతో మరింత క్లారిటీ వచ్చింది.
మరోవైపు, మలైక ఇక వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అని ప్రకటించింది. ఆమెకి సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నాయి. ఇక వెబ్ సిరీస్, వెబ్ డ్రామాల్లో ఎక్కువగా కనిపించాలనుకుంటోంది.