హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు


ఒకప్పుడు హీరోయిన్ గా హల్చల్ చేసిన నటి… మాలాశ్రీ. తెలుగులో ప్రేమఖైదీ, ఘరానా అల్లుడు, బావబావమరిది, తోడికోడళ్లు వంటి చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన వారసురాలిని చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు. కన్నడ చిత్రసీమలో మాలాశ్రీకి బాగా పలుకుబడి, స్టార్డం ఉంది.

ఇటీవలే ఆమె భర్త రాము కన్నుమూశారు. దాంతో, ఇప్పుడు కూతురిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆమె కూతురు పేరు రధన రాము. ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కన్నడ హీరో దర్శన్ సరసన రధన నటిస్తోంది.

ముంబైలో నటన నేర్చుకొంది రధన. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలి అనుకుంటోంది ఈ కుర్ర భామ.

హీరోల, హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లగా పరిచయం కావడం కొత్తేమి కాదు. కానీ, తమ కూతుళ్ళని పరిచయం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కన్నడంలో పెద్ద హీరోగా పేరొందిన దర్శన్ సరసన నటింపచేస్తోంది అందుకే.

 

More

Related Stories