మాళవిక ఆశలు గల్లంతు

Malavika Mohanan

మాళవిక మోహనన్… సోషల్ మీడియా వేదికను వేడెక్కించే హీరోయిన్. ప్రతిరోజూ హాట్ హాట్ ఫోటోలు అప్డేట్ చేస్తుంటుంది. అందచందాలు ఆరబోతలో బాగా స్పీడ్ గా ఉంటుంది. గ్లామర్ షోకి ఆమె కేరాఫ్ అని చెప్పొచ్చు. అలాంటి భామ… విజయ్ వంటి పెద్ద సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టిందంటే… గ్లామర్ తో అదరగొడుతుంది అని అందరూ భావిస్తారు కదా! కానీ అలాంటిదేమి జరగలేదు.

మాళవిక “మాస్టర్” సినిమాలో పోషించిన పాత్ర ఆల్మోస్ట్ సైడ్ క్యారెక్టర్. మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో ఆమె ఒక పది సీన్లలో దర్శనమిస్తుంది.

పూర్తిగా ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకొంది. డ్రెస్సింగ్ కన్నా ఆమెని చూపించిన విధానం మాళవిక కెరీర్ కి ఏ రకంగానూ ఉపయోగపడదు. నటించే స్కోప్ ఉన్న పాత్ర కాదు. హీరోయిన్ గా రెండు డ్యూయెట్లు కూడా లేవు.ఎదో సినిమాలో ఉంది అంటే..ఉంది అన్నట్టు వంటి రోల్. ఈ సినిమా చూశాక, ఆమెకి మరి పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయా అనేది డౌటే.

కెరీర్ విషయంలో ఊహించుకున్నదానికి భిన్నంగా జరిగింది. “మాస్టర్” సినిమాకి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళనాట ఆమెకి కొంత క్రేజ్ రావొచ్చు. ఐతే, ఈ సినిమాతో పెద్ద హీరోయిన్ ఐపోవాలన్న ఆమె అసలు మాత్రం గల్లంతు అయినట్లే కనిపిస్తోంది.

More

Related Stories