మాళవిక కాన్ఫిడెన్స్ సూపర్

- Advertisement -

మాళవిక మోహనన్ ఈ ఏడాది బిగ్ హిట్ అందుకొంది. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. అది ఈ ఏడాది థియేటర్లో విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాల్లో ఒకటి. కానీ, ఎందుకో ఆమెకి మరో భారీ మూవీ అఫర్ రావడం లేదు.

అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ రష్మిక మందాన, పూజ హెగ్డే వంటి హీరోయిన్లే పెద్ద సినిమాలన్నీ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. రాశి ఖన్నా వంటి భామలకు కూడా అవకాశాలు సంపాదించుకుంటున్నారు. కానీ మాళవిక పేరు ఏ బడా సినిమాల విషయంలోనూ వినిపించడం లేదు. ఐతే, ఈ భామ మాత్రం బాధ పడడం లేదు. వచ్చే టైంకి అవే వెతుక్కుంటూ వస్తాయని కాన్ఫిడెంట్ గా ఉంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక చిన్న మూవీ చేస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం హాట్ హాట్ ఫొటోలు షేర్ చేసి అభిమానులకు కనువిందు కలిగిస్తుంది.

https://tc.advweb.in/actress/malavika-mohanan-at-a-waterfall-photoshoot

 

More

Related Stories