
మాళవిక మోహనన్ తనని తాను తెలుగు తెరపై చూసుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆమె మొదటి సినిమాకి ఇంకా మోక్షం రావడం లేదు. ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది.
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఒక చిత్రం తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి ఏడాదిపైనే అయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఒక్క ప్రకటన లేదు. ఒక్క ఫోటో విడుదల కాలేదు. ఇక ఈ మూవీ విడుదల విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది.
ప్రభాస్ నటించిన “సలార్” ఈ నెల 22న విడుదల కానుంది. దాంతో, ప్రభాస్ చేతిలో ఉన్న అనేక చిత్రాల్లో ప్రధానమైనవి విడుదల అయిపోయినట్లే. వచ్చే ఏడాది ఆయన నటిస్తున్న “కల్కి” సినిమా విడుదల అవుతుంది. “కల్కి” షూటింగ్ పూర్తి కావడం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడాన్ని బట్టి మారుతి తీస్తున్న మూవీకి మోక్షం లభిస్తుంది. సో అప్పటివరకు మాళవిక మోహనన్ కి నిరీక్షణ తప్పదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ప్రభాస్ – మారుతి మూవీ మరో ఏడాది తర్వాతే (అంటే 2024 డిసెంబర్ లోపు) విడుదల అవుతుంది.
నిజానికి మాళవిక “హీరో” అనే చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయం కావాలి. విజయ్ దేవరకొండ హీరోగా, మాళవిక హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక భారీ చిత్రాన్ని నాలుగేళ్ల క్రితం లాంచ్ చేసింది. కానీ ఆ కొత్త దర్శకుడు తీసిన ఫుటేజ్ నచ్చలేదు నిర్మాతలకు. దాంతో దాన్ని అటకెక్కించారు. అలా మాళవిక తెలుగు ఎంట్రీ నాలుగేళ్లుగా వాయిదా పడుతోంది.
ALSO CHECK Latest Photos of Malavika Mohanan at an awards event

మరి మాళవిక మొదటి తెలుగు చిత్రం కనీసం 2024లోనైనా విడుదల అవుతుందా? అంతా ప్రభాస్ చేతిలో ఉంది.