
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చెయ్యకుండా, శంకర్ మరో సినిమా చేపట్టడానికి వీల్లేదు అని ఇప్పటికే లైకా సంస్థ కేసు వేసింది. అలాగే, దేశమంతా లాక్డౌన్ పడింది. ఈ గ్యాప్ లో నిర్మాత దిల్ రాజు అమెరికా వెళ్లిపోయారు. ఆయన ఇంకా ఇండియాకి రాలేదు.
దాంతో, రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ప్రకటించిన మూవీ గురించి క్లారిటీ లేకుండా పోయింది. ఈ ఏడాది మొదలవుతుందా లేదా సైడుకు వెళ్తుందా అనేది ఇంకా తేలలేదు.
ఐతే, ఈ గ్యాప్ లో ఈ సినిమాలో హీరోయిన్ గా ఫలానా భామ సెలెక్ట్ అయిందని రోజుకో ప్రచారం జరుగుతోంది. మొన్నటివరకు రష్మిక పేరు వినిపించింది. ఇప్పుడు మాళవిక పేరు లిస్ట్ లోకి వచ్చింది. ముందు సినిమా ఉంటుందా లేదా అని తేలకుండా హీరోయిన్ గురించి ఎందుకు చర్చ అనేది రామ్ చరణ్ అభిమానుల ప్రశ్న. ‘మాస్టర్’ సినిమాతో బాగా పాపులర్ అయింది మాళవిక మోహనన్.