ఇప్పుడైనా దశ తిరుగుతుందా?

Malavika Mohanan

విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది మాళవిక మోహనన్. నిజానికి ఆమె తెలుగులో ఇంతకుముందే ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె తొలి తెలుగు సినిమా ఒక షెడ్యూల్ తర్వాత అటకెక్కింది. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఘనంగా ప్రారంభించిన “హీరో” అనే స్పోర్ట్స్ డ్రామాలో ఆమె హీరోయిన్. కానీ ఆ సినిమా అటకెక్కింది. అలా తెలుగులో ఇప్పటికే పరిచయం అయ్యే ఛాన్స్ మిస్ కొట్టింది.

ఇప్పుడు అనువాద చిత్రంతో మన ముందుకొస్తోంది మాళవిక. తెలుగులో ఎంట్రీ ఇవ్వకపోయినా మాళవిక ఇప్పటికే పాపులారిటీ తెచ్చుకొంది. ఎందుకంటే ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో చాలా హాట్ హాట్ ఫోటోలు అప్డేట్ చేస్తోంది.

Also Check: Malavika Mohanan at Master promotions

అందాల ఆరబోతలో అస్సలు మొహమాటపడదు. బాలీవుడ్లో ఇప్పటికే నటించింది. ఆమె నటన ప్రతిభ ఎలా ఉందో చూడాలి. కానీ ఆమె గ్లామర్ సొగసు మాత్రం కుర్రకారు ఇన్ స్టాలో చూసి ఫిదా అయ్యారు. “మాస్టర్” తెలుగులో ఆడితే, ఆమెకి ఇక్కడ అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

Also Check: Malavika Mohanan – Pics

More

Related Stories