- Advertisement -

‘మాస్టర్’ సినిమాతో మంచి పాపులారిటీ పొందింది మాళవిక మోహనన్. ఈ బ్యూటీ మరిన్ని బిగ్ మూవీస్ కోసం వెయిట్ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టించే ఈ భామకి బైక్ రైడింగ్ ఇష్టమంట. అలాగే, మగవాళ్ళు బైక్ నడిపితే సెక్సీగా ఉంటారని చెప్తోంది.
“నచ్చిన వాళ్ళతో అలా లాంగ్ డ్రైవ్ కి బైక్ మీద వెళ్తే ఉండే మజానే వేరు. అంతకన్నా రొమాంటిక్ ఫీల్ ఇంకేముంటుంది,” తన డేటింగ్ ఐడియాస్ చెప్తోంది. మరి ఎవరితో డేటింగ్ లో ఉన్నారు అంటే ఎవరూ లేరు అని అంటోంది.