
హీరోయిన్ మాళవిక మోహనన్ చాలా బోల్డ్. ఆమె ఫోటోషూట్ లు అలాగే ఉంటాయి. ఆమె చెప్పే ముచ్చట్లు కూడా అంతే. “మాస్టర్” సినిమాలో దళపతి విజయ్ సరసన నటించి పాపులర్ అయింది మాళవిక.
ఈ అందాల భామ ప్రస్తుతం ఒక సినిమా కోసం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తోంది. షూటింగ్ స్పాట్ లో పాత్రకి తగ్గట్లు ఉండాలి. ముఖానికి మాస్క్ వేసుకోవద్దు కదా. షూటింగ్ సీన్ కోసం మాస్క్ తీసి పక్కన పెడితే జనం అందరి ముందు నగ్నంగా ఉన్నట్లు అని అంటోంది ఈ భామ.
“బయటికి అడుగుపెడితే మాస్క్ ధరించడం ఇప్పుడు ఒక రొటీన్ చర్య అయిపోయింది. కానీ షూటింగ్ టైములో మాస్క్ పెట్టుకోలేం కదా. మొన్న అవుట్ డోర్ లొకేషన్లో షూటింగ్ చేశాం. షూటింగ్ చూసేందుకు జనం విపరీతంగా వచ్చారు. అంత జనం మధ్య మాస్క్ లేకుండా నిల్చుంటే… నగ్నంగా ఉన్నట్లే అనిపించింది. మాస్క్ అనేది మన డ్రెస్సింగ్ లో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు,” అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈ బ్యూటీ.
ALSO CHECK: Malavika Mohanan mesmerizing look – Pics

ఈ ముద్దుగుమ్మ కొంచెం అతిగా పోలిక తెచ్చినట్లు అనిపించినా.. ఆమెని చూసైనా అందరూ మాస్క్ ధరించాలి. బయట ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిందే. లేదంటే బట్టలు లేకుండా నిల్చున్నట్లే.