ఇప్పటికైనా ఆఫర్ దక్కేనా?

- Advertisement -
Malavika Mohanan

మాళవిక మోహనన్ అందంగా ఉంటుంది. అంతకన్నా మించి…. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె అందచందాల ప్రదర్శన మాములుగా ఉండదు. అందం ఉన్నది చూపించడానికి అన్నట్లు ఉంటుంది ఆమె పాలసీ. క్రమం తప్పకుండా సెక్సీ ఫోటోలు షేర్ చేసే భామ.. మాళవిక మోహనన్.

ఐతే, అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెతలా, ఆమెకి ఎందుకనో తెలుగులో బిగ్ ఆఫర్ రావడం లేదు. తమిళంలో విజయ్ సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించింది. ఇప్పుడు ధనుష్ సరసన నటిస్తోంది. తెలుగులో మాత్రం ఇంకా అవకాశాలు రావట్లేదు.

ఆ మధ్య విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ అనే సినిమా సైన్ చేసింది. కానీ ఒక షూటింగ్ షెడ్యూల్ పూరయ్యాక ఆ మూవీ ఆగిపోయింది. దాంతో, తెలుగులో ఆమె అరంగేట్రంకి బ్రేకులు పడ్డాయి.

తాజాగా ప్రభాస్ సరసన ఒక హీరోయిన్ గా ఆమె నటించొచ్చు అని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మారుతికి ప్రభాస్ అవకాశం ఇచ్చాడు. “రాజా డీలక్స్” పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఒక హీరోయిన్ గా మాళవికని అనుకుంటున్నారట. “అనుకోవడం” వరకే ఇంకా సైన్ కాలేదు.

మరి మాళవికకి ఇప్పుడైనా తెలుగులో అరంగేట్రం దక్కుతుందా?

 

More

Related Stories