తెలుగులో మాళవికకు ఇంకో బడా అఫర్?

Malavika

మాళవిక మోహనన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె నటించిన చిత్రం ఇప్పటివరకు ఒక్కటీ విడుదల కాలేదు కానీ ఆమె గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో నటిస్తోంది. మొదట విజయ దేవరకొండ సరసన “హీరో” అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగానే ఆగిపోయింది.

ఆ తర్వాత ప్రభాస్ సరసన “ది రాజా సాబ్”లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల కానుంది. సో, మాళవిక మోహనన్ కి అదే మొదటి తెలుగు చిత్రం కానుంది.

ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమాలో ఆమె నటించే అవకాశం ఉండనే ప్రచారం మొదలైంది. రామ్ చరణ్ – ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక కొత్త సినిమా ఇటీవలే మొదలైంది. ఇందులో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది.

ఐతే ఈ కథలో మరో భామకి కూడా ఛాన్స్ ఉందట. ఆ రెండో భామ పాత్రకు మాళవిక పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. మరి నిజంగా ఈ భామకి ఈ బిగ్ ఆఫర్ దక్కుతుందా అనేది చూడాలి.

 

More

Related Stories