తెలుగులో ఎంట్రీ అఫీషియల్!

Malavika Mohanan


మాళవిక మోహనన్ తెలుగులో అడుగుపెట్టాలని గత మూడేళ్ళుగా ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పటికే తమిళంలో సూపర్ స్టార్ విజయ్ సరసన నటించింది. మూడేళ్ళక్రితం తెలుగులో విజయ్ దేవరకొండ చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అప్పటి నుంచి తెలుగులో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.

ఆమె నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించింది. ఏకంగా ప్రభాస్ సరసన నటిస్తోందిప్పుడు. ఆమెకి తెలుగులో మొదటి చిత్రం ప్రభాస్ మూవీ అవుతోంది. దర్శకుడు మారుతి – ప్రభాస్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న సినిమాలో ఆమె ఒక హీరోయిన్. ఆమెకి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా పూర్తిచేశారు. అంటే, ఆమె ఎంట్రీ ఇక అఫీషియల్.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒక భామ మాళవిక మోహనన్. ఐతే, తెలుగులో పెద్ద హీరో సరసన లాంచ్ కాబట్టి ఆమె ఒప్పుకొంది.

ఈ సినిమా వచ్చే వారం నుంచి మొదలు కానుంది. ఒక వారం రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత జరిగే షెడ్యూల్ లో మాళవిక ఎంట్రీ ఇస్తుంది.

ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది మాళవిక. అందాలను అస్సలు దాచుకోదు. అందుకే, యూత్ కిష్టం ఆమె అంటే.

 

More

Related Stories