
మాళవిక మోహనన్ తెలుగులో ఇంకా అడుగుపెట్టలేదు. ‘మాస్టర్’ వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసే హాట్ హాట్ ఫోటోలు మరింతగా కుర్రకారుకు చేరువ చేశాయి. త్వరలోనే ప్రభాస్ సరసన ఒక మూవీ చేయనుంది ఈ భామ.
ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలు అప్లోడ్ చేసే ఈ భామకి నటిగా పేరు తెచ్చుకునే పాత్రలు అంటే ఇష్టమట.
“నా దృష్టిలో సమంత కెరియర్ అద్భుతం. ఆమె అనేక పాత్రలు చేసింది. గ్లామర్ గా నటించింది. అభినయం చూపించే పాత్రలు చేసింది. రంగస్థలం, ఓ బేబీ, ది ఫ్యామిలీ మేన్, పుష్ప…. ఇలా ఎంతో వెరైటీ ఉంది ఆమె సినిమాలఎంపికలో. ఆమెలా నా కెరియర్ తీర్చిదిద్దుకోవాలి,” అని చెప్తోంది మాళవిక.
సమంత డేరింగ్ ఆటిట్యూడ్ నచ్చుతుంది అని చెప్తున్న ఈ భామ తాజాగా ధనుష్ సరసన ‘మారన్’ అనే చిత్రం చేసింది. ఆ మూవీ తాజాగా హాట్ స్టార్ లో విడుదలైంది. ఇందులో మాళవిక పాత్రకి అన్ని నెగిటివ్ మార్కులే. ఇప్పటివరకు ఆమె ఇంకా నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రల్లో కనిపించలేదు.

అందాల ఆరబోతలో మాత్రం “ఊ అంటావా” సాంగ్ లో సమంతలో ధీటుగానే ఉంది.