మళ్ళీ పెళ్లి… సినిమా కోసమే!

- Advertisement -

60 ఏళ్ల నరేష్, 45 ఏళ్ల పవిత్ర లోకేష్ మధ్య ఉన్న బంధం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమి లేదు. అంతా వాళ్లే చెప్పేశారు. పవిత్రకి, తనకి పెళ్లి అయిందంటూ ఇటీవల నరేష్ ఒక వీడియో కూడా విడుదల చేశాడు. మూడో భార్యకి విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని చాలామంది లా పాయింట్ లేవదీశారు. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది.

నరేష్, పవిత్ర ఒక సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా పేరు… “మళ్ళీ పెళ్లి.” హీరో, హీరోయిన్ నరేష్, పవిత్ర. ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు ఒక మెచ్యూర్డ్ కపుల్ పై స్టోరీ తీస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా నరేష్. ఈ సినిమాలో పెళ్లి జరిగే సన్నివేశాన్ని, అలాగే హనీమూన్ కి వెళ్లిన ఒక సీన్ కూడా ఉందట. ఆ వీడియోలను ఇంతకుముందు విడుదల చేసి… అది వారి నిజమైన పెళ్లి, హనీమూన్ లా కలరింగ్ ఇచ్చారు.

తమ కొత్త సినిమా ప్రమోషన్ కోసం తమ మధ్య ఉన్న బంధాన్ని, వివాదాన్ని వాడుకొంది ఈ జంట.

తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వీడియోని నరేష్ జనవరి ఒకటో తేదీన విడుదల చేశారు. అందులో నరేష్, పవిత్ర లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న దృశ్యం కనిపించింది. ఇక కొన్ని రోజుల క్రితం పెళ్లి వీడియోని, దుబాయ్ లో హనీమూన్ ఫోటోలని విడుదల చేశారు. ఇవన్నీ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా కోసమే అని అర్థమవుతోంది.

రియల్ లైఫ్ లో రియల్ జంట

Naresh and Pavitra

ఐతే, రియల్ లైఫ్ లో కూడా వీరు కలిసే ఉంటున్నారు. కాకపొతే, నరేష్ ఇంకా మూడో భార్యకి విడాకులు ఇవ్వలేదు. మూడో భార్య నుంచి కోర్టు ద్వారా విడాకులు పొందకుండా నాలుగో పెళ్లి చేసుకునేందుకు నరేష్ ఉవ్విళూరుతున్నాడు కానీ అది చట్టబద్ధంగా చెల్లదు. ఈ సినిమా పేరు చెప్పి తమ బంధాన్ని అందరికీ తెలియచేశాడు 60 ఏళ్ల నిత్య పెళ్లి కొడుకు. అవునండీ, ఇటీవల తనకు తానుగా ‘నిత్య పెళ్లి కొడుకు’ అనే బిరుదు ఇచ్చుకున్నాడు నరేష్.

 

More

Related Stories